Current Affairs Telugu Daily

బ్రిటన్‌లో తొలిసారిగా ‘రీకాల్‌’ అమలు
తొలిసారిగా బ్రిటన్‌లో ఓ ఎంపీ రీకాల్‌ విధానంలో ఉద్వాసనకు గురయ్యారు. ఆ ఎంపీ పేరు ఫియోనా ఒనసాన్య. వయసు 35 ఏళ్లు.
*2017లో పీటర్‌బరో నియోజకవర్గం నుంచి లేబర్‌ పార్టీ తరఫున పోటీ చేసి అధికార కన్జర్వేటివ్‌ అభ్యర్థిపై 607 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
*తమ ఎంపీ ఫియోనా నేరానికి పాల్పడ్డారనీ, ఆమెకు ఉద్వాసన పలకాలంటూ రీకాల్‌ పిటిషన్‌పై నియోజకవర్గానికి చెందిన 28% మంది ఓటర్లు సంతకాలు చేశారు. దీంతో ఆమెను తొలగిస్తున్నామని, ఆ స్థానానికి తిరిగి జూన్‌ 6న ఎన్నిక నిర్వహిస్తామని పార్లమెంటు  వెల్లడించింది.
​​​​​​​*​​​​​​​2015లో నాటి ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధిని వెనక్కి పిలిచేలా రీకాల్‌ విధానాన్ని తీసుకొచ్చారు.

views: 848



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams