Current Affairs Telugu Daily

భారత పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో లండన్‌ మొదటిస్థానం
భారత పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో లండన్‌ మొదటిస్థానంలో ఉన్నట్లు ఓ తాజా నివేదిక వెల్లడించింది. దుబాయ్‌, సింగపూర్‌ లాంటి ప్రముఖ నగరాలతో పోలిస్తే బ్రిటన్‌ రాజధాని లండన్‌లోనే భారతీయులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక పేర్కొంది. 
*52 ప్రాజెక్టులతో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో నిలవగా  అమెరికా 51 ప్రాజెక్టులు, యూఏఈ 32 ప్రాజెక్టులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయని లండన్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘లండన్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌’ వెల్లడించింది.
*2017తో పోలిస్తే గత సంవత్సరం ఏకంగా 32 ప్రాజెక్టుల్లో భారత వ్యాపారులు పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. ఎఫ్‌డీఐలు దాదాపు 255శాతం మేర వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. అలాగే బ్రిటన్‌లో భారత పెట్టుబడుల్లో 100శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అందులో 60శాతం లండన్‌ కంపెనీల్లోనే ఉన్నాయని వెల్లడించారు.  

views: 888



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams