Current Affairs Telugu Daily

వర్సిటీ పరీక్ష ఫలితాల సంస్కరణలపై కమిటీ
వర్సిటీల వార్షిక పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల విడుదల వంటి ప్రధాన అంశాలపై అధ్యయనానికి ముగ్గురు ఉపకులపతులతో కమిటీని నియమించింది. ఇందులో ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల వీసీలు ఆచార్య రామచంద్రం, సాయన్న, అల్తాఫ్‌ హుస్సేన్‌లు సభ్యులుగా ఉంటారు.
*మండలికి కమిటీ నెలరోజుల్లో నివేదిక అందజేయనుంది. వర్సిటీల్లో పరీక్షల సంస్కరణలపై మండలి ఛైర్మన్‌ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆచార్య లింబాద్రి, వెంకటరమణ, విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఉపకులపతులతో సమావేశమై చర్చించారు. 

ముఖ్యమైన నిర్ణయాలుః
* ప్రతి మూల్యాంకన కేంద్రంలోనూ సీసీ కెమెరాలు తప్పనిసరి. ఆ కేంద్రాన్ని వీసీ గదికి అనుసంధానం చేసి, ఎక్కడ  ఏం జరుగుతోందో పర్యవేక్షిస్తూ ఉండాలి. 
* మూల్యాంకన కేంద్రాల్లో సెల్‌ఫోన్లను ఎగ్జామినర్లు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడరాదు. 
* ఫలితాల్లో ఏదైనా తప్పు జరిగినప్పుడు..బాధ్యత సర్వీసు ప్రొవైడర్‌దా, వర్సిటీదా అని కాకుండా- వీసీలే మొత్తంగా బాధ్యత వహించాలి. ఫలితాల ప్రక్రియను ప్రొవైడర్‌ పూర్తిచేసిన తర్వాత, అందులో కచ్చితత్వాన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత వర్సిటీలదే. 
* పరీక్షల విభాగాల్లో ఏ తప్పులకు ఎవరు బాధ్యులో తేలే విధంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. 
* కొన్ని వర్సిటీల్లో జవాబుపత్రాల ఫొటోస్టాట్‌ కాపీలు ఇవ్వడం లేదు. ఎంతో కొంత రుసుం నిర్ణయించి, విద్యార్థులు అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందే. లేకుంటే విశ్వసనీయత ఉండదు. 
* మొదటి సంవత్సరంలో 90 శాతానికి పైగా మార్కులు వచ్చి కూడా..రెండో ఏడాదిలో తప్పుతున్నారా అనేది సాఫ్ట్‌వేర్‌ ద్వారా పరిశీలించి, జవాబుపత్రాలను మరోసారి సరిచూడాలి. సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాల విడుదల జరగాలి. 
* ఫలితాల తర్వాత, తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలి. విద్యార్థినీ విద్యార్థులకు కూడా మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేయాలి. 
* ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎస్‌)ను అన్ని వర్సిటీల్లో ఒకేవిధంగా అమలు చేయాలి. ఒకేలా గ్రేడ్ల విధానం ఉండాలి. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది.

views: 784

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams