Current Affairs Telugu Daily

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానం 
వార్షిక అప్‌డేట్స్‌లో భాగంగా ప్రకటించిన తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, వన్డేలో రెండో ర్యాంక్‌ దక్కించుకుంది.
*వన్డేల్లో ఇంగ్లండ్‌ టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకుంది. 2015-16 సిరీస్‌ ఫలితాలను తొలగించి 2016-17, 2017-18 రిజల్ట్స్‌కు 50 శాతం వెయిటేజీ ఇస్తూ తాజాగా అప్‌డేట్‌ చేసిన ర్యాంకుల జాబితాను ఐసీసీ విడుదల చేసింది.
*టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలవగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.
*ఇంగ్లండ్‌ వన్డేల్లో నెం.1 ర్యాంక్‌లో నిలవగా ,కేవలం 2 పాయింట్ల తేడాతో భారత్‌ తర్వాతి స్థానం దక్కించుకుంది. దక్షిణాఫ్రికా మూడో ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, శ్రీలంక తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
International Cricket Council:
  • CEO: Dave Richardson
  • Chairperson: Shashank Manohar
  • Headquarters: Dubai, United Arab Emirates

views: 787

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams