Current Affairs Telugu Daily

ఏప్రిల్‌ జీఎస్‌టీ ఆదాయం రూ.1.13 లక్షల కోట్లతో కొత్త రికార్డు 
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ.1.13 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.మార్చిలో వసూలైన రూ.1.06 లక్షల కోట్లతో పోలిస్తే మరో రూ.7,000 కోట్లు పెరిగింది.
*గత ఏడాది ఏప్రిల్‌లో నమోదైన రూ.1.03 లక్షల కోట్లతో పోలిస్తే పన్ను ఆదాయం 10.05 శాతం పెరగగా గత ఆర్థిక సంవత్సరానికి(2018-19) నమోదైన నెలవారీ వసూళ్ల సరాసరి రూ.98,114 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది.
*కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,13,865 కోట్లు. అందులో సెంట్రల్‌ జీఎస్‌టీ వాటా రూ.21,163 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ రూ.28,801 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.54,733 కోట్లుగా నమోదైంది. విలాస వస్తువులు, పొగాకువంటి హానికారక ఉత్పత్తులపై జీఎస్‌టీకి అదనంగా విధించే సుంకం రూపంలో మరో రూ.9,168 కోట్లు వసూలైంది.
  • ఏప్రిల్‌ 30 వరకు మార్చి నెలకు సంబంధించిన 72.13 లక్షల జీఎస్‌టీ రిటర్నులు (జీఎ్‌సటీఆర్‌-3బీ) దాఖలయ్యాయి.
  • కేంద్ర ప్రభుత్వం ఐజీఎ్‌సటీ నుంచి రూ.20,370 కోట్లు సెంట్రల్‌ జీఎస్‌టీకి, రూ.15,975 కోట్లు స్టేట్‌ జీఎస్‌టీకి సెటిల్‌ చేసింది. ఆ తర్వాత ఐజీఎస్‌టీ వసూళ్లలో మిగిలిన మొత్తంలో నుంచి మరో రూ.12,000 కోట్లను కేంద్రం, రాష్ట్రాలకు చెరి సమానంగా ప్రొవిజనింగ్‌ చేయడం జరిగింది.
  • రెగ్యులర్‌, ప్రొవిజనల్‌ సెటిల్‌మెంట్ల అనంతరం గతనెలకు సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.47,533 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ రూ.50,776 కోట్లుగా నమోదైంది.

views: 819

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams