Current Affairs Telugu Daily

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న అపూర్వి 
భారత ఏస్‌ షూటర్‌ అపూర్వి చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఇదే విభాగం నుంచి మరో భారత షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ రెండో ర్యాంక్‌ను దక్కించుకుంది. *భారత్‌కు టోక్యో (2020) ఒలింపిక్స్‌ బెర్త్‌లను సాధించి పెట్టిన ఐదుగురు షూటర్లలో చండేలా కూడా ఉంది. *రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల అపూర్వి గత ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్‌క్‌పలో రికార్డు స్కోరు (252.9)తో స్వర్ణ పతకం నెగ్గింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన ఆమె 2018 ఆసియాడ్‌లో కాంస్యం అందుకుంది. ‘
- రెండో ర్యాంకులో నిలిచిన అంజుమ్‌  ఇటీవల బీజింగ్‌ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది.
*మహిళల 25 మీ. పిస్టల్‌ విభాగంలో మను భాకర్‌ 10వ ర్యాంక్‌లో, పురుషుల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ర్యాంకింగ్స్‌లో దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌లో అభిషేక్‌ వర్మ ప్రపంచ మూడో ర్యాంక్‌ను దక్కించుకోగా సౌరభ్‌ చౌధురి 6వ ర్యాంక్‌లో నిలిచాడు.
*25 మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ కేటగిరీలో అనీష్‌ భన్వాలా 10వ ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు.

views: 795



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams