Current Affairs Telugu Daily

దేశంలోనే అతిపెద్ద మోడల్‌ కాలనీ పేదల స్వర్గ ధామం గా కొల్లూరు
దేశంలోనే ప్రభుత్వ రంగంలో నిర్మితమవుతున్న అతి పెద్ద గృహ సముదాయం.. రాజధాని సమీపంలోని కొల్లూరులో రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ 15,660 గృహాలను నిర్మిస్తున్నారు
*హైదరాబాద్‌ మహానగరంలో దాదాపు లక్ష రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రారంభించింది. ఇందులో 97 వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 
*ఈ ప్రాజెక్టు మొత్తంలో ముఖ్యమైనది కొల్లూరు టౌన్‌షిప్‌. పఠాన్‌చెరుకు సమీపంలోని రామచంద్రాపురం మండల పరిధిలోని కొల్లూరులో 124 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికోసం వినియోగిస్తున్నారు. రూ.1354 కోట్లను వ్యయం చేస్తున్నారు. 117 అపార్టుమెంట్‌ బ్లాకులుగా 11అంతస్తులుగా వీటి నిర్మాణం చేపట్టారు.

views: 957Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams