Current Affairs Telugu Daily

హిమాలయ పర్వత శ్రేణుల్లో అనుమానాస్పద పాద ముద్ర’లను నిపుణుల పరిశీలనకు పంపాలని నిర్ణయించిన భారత సైన్యం 
పురాణాల కాలం నుంచి వినవస్తున్న ‘యతి’ అడుగు జాడలుగా చెబుతున్న ముద్రల చిత్రాలను నిపుణులకు పంపించాలని భారత సైన్యం నిర్ణయించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భారీ జీవి ఉన్నట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 
*ఈ నేపథ్యంలో నేపాల్‌లోని మకాలూ బేస్‌క్యాంప్‌నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని ‘అనుమానాస్పద పాద ముద్ర’లు 32×15 అంగుళాల పరిమాణంలో కనిపించాయి. తమ పర్వతారోహణ బృందం వీటి ఛాయాచిత్రాలు, వీడియోలను తీసుకున్నట్లు సైన్యం వెల్లడించి, ఛాయాచిత్రాలనూ విడుదల చేసింది. మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, ఇంకేదైనా వికృతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్‌ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు వెల్లడించింది.
*సగటు మనిషి కంటే పెద్దగా, ఎత్తుగా ఉండే కోతిలాంటి జీవి- హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి. 
*ఈ నేపథ్యంలో మేజర్‌ మనోజ్‌ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందానికి దొరికిన చిత్రాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.  ఈ ముద్రలు దేనికి చెందినవో అర్థం చేసుకునేందుకు నిపుణుల సాయం తీసుకోనున్నారు.

హిమాలయాలు:
భారతదేశంలో ప్రవహించే నదుల ఆధారంగా, ప్రాంతాల వారీగా హిమాలయాలను తూర్పు, పడమరలుగా 5 రకాలుగా విభజించొచ్చు. అవి..
 1. కశ్మీర్ హిమాలయాలు
 2. పంజాబ్ హిమాలయాలు
 3. కుమయూన్ హిమాలయాలు
 4. నేపాల్ (లేదా) మధ్య హిమాలయాలు
 5. అస్సాం హిమాలయాలు
*ప్రపంచంలోని అతిపెద్ద నదీ ఆధారిత దీవి  మజులీ ఈ హిమాలయాల్లోనే ఉంది. 
* గారో, కాశీ, జయంతియా, మిర్ కొండలు ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి.
కనుమలుః
*రెండు కొండల మధ్య లేదా పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన రహదారిని కనుమ అంటారు.
*బనీహాల్ కనుమ: ఇది జమ్మూ, శ్రీనగర్‌ను కలుపుతుంది. దీన్ని ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని అంటారు.
*భారతదేశంలో అతి పొడవైన ‘జవహర్ టన్నెల్’ ఈ కనుమ వద్ద ఉంది.
*జోజిలా కనుమ: ఇది లేహ్, శ్రీనగర్ ప్రాంతాలను కలుపుతుంది. ఇది జమ్మూకశ్మీర్ రాష్ర్టంలో ఉంది.
*ఖార్డుంగ్లా కనుమ: ఇది భారతదేశంలో ఎత్తై కనుమ. ఇది జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉంది. 
*కారకోరం కనుమ: ఇది భారతదేశం, చైనాల మధ్య ఉంది. 
*బుర్జిలా కనుమ: ఇది జమ్మూకశ్మీర్‌లోని కశ్మీర్ లోయ నుంచి మధ్య ఆసియా వరకు ఉంది.
* పిర్‌పంజాల్ కనుమ: ఇది కశ్మీర్‌లో ఉంది.ఇది జమ్మూ, శ్రీనగర్‌ను కలుపుతుంది.జమ్మూ-శ్రీనగర్ రహదారి ఈ కనుమ ద్వారా పోతుంది.
*రోహతంగ్ కనుమ: ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంది. కులూ- క్యెలాంగ్‌లను కలుపుతుంది.

>>> 1వ శతాబ్దంలోనే యతి ప్రస్తావన!
అసలు యతి ఉన్నాడన్న సంగతిని తొలిసారి 1వ శాతాబ్దంలో అధికారికంగా గుర్తించారని చరిత్ర చెబుతోంది. నేపాల్‌ తెగ ‘షెర్పాస్‌’ యతిని గుర్తించిందట. రోమన్‌ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్‌ రచించిన  ‘నేచురల్‌ హిస్టరీ ఇన్‌ ది ఫస్ట్‌ సెంచరీ ఏడీ’ అనే పుస్తకంలో వనజీవిగా పేర్కొంటూ యతిని గురించి ప్రస్తావించారు. 
*హిమాలయాల్లో యతి ఉనికి ఉన్నట్లు 1832లో పాశ్చాత్యదేశాలకు తెలిసింది. ‘ఆసియాటిక్‌ సొసైటీ ఆఫ్‌ బెంగాల్‌’ పేరుతో బ్రిటిషర్‌ బీహెచ్‌ హోడ్జ్‌సన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు
*ఎన్‌ఏ టాంబ్జి అనే గ్రీక్‌ ఫొటోగ్రాఫర్‌ హిమాలయాల్లో యతి గురించి స్పష్టమైన వివరాలను వెల్లడించారు.

views: 849

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams