Current Affairs Telugu Daily

ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) కలగజేసుకోకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశం
ప్రభుత్వ రోజువారీ వ్యవహారాలు పరిశీలించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారాలు ఉన్నాయంటూ 2017 జనవరి 27, జూన్‌ 16న కేంద్ర హోం మంత్రిత్వశాఖ పంపిన లేఖలను సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్‌ వ్యాజ్యం దాఖలు చేశారు.
*న్యాయమూర్తి జస్టిస్‌ మహదేవన్‌  ఆధ్వర్యంలో విచారించిన ధర్మాసనం ముఖ్యమంత్రి అధికారాల్లో, ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కలగజేసుకునేందుకు చట్టం అనుమతించదని, దస్త్రాలు పరిశీలించి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయలేరని స్పష్టం చేశారు. 
*అధికారులు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ముందుగా సమాధానం చెప్పాకే ..గవర్నర్‌కు చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
*ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అధికారం ఉందనే ప్రభుత్వ లేఖలను న్యాయమూర్తి రద్దు చేశారు.

పుదుచ్చేరి:
*దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతము.
*తమిళంలో 'పుదు - చ్చేరి' అంటే 'క్రొత్త - ఊరు' అని అర్థం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు "Poudichéry" అని పిలిచారు. 
*1954 నవంబరు 1 నుండి పాలనా వ్యవహారాలు భారతదేశపు అధీనంలోకి వచ్చినా, 1962 వరకు అధికారికంగా భారతదేశంలో విలీనం జరుగలేదు. 1963లో పుదుచ్చేరి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయబడింది.
*సీఎం: నారాయణ స్వామి

views: 794

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams