Current Affairs Telugu Daily

జపాన్‌ 126వ చక్రవర్తిగా నరుహితో
ప్రపంచ ప్రఖ్యాత రాజరిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌లో ఓ శకం ముగిసింది
*వృద్ధాప్య సమస్యల కారణంగా అకిహితో తాను చక్రవర్తి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు  2016లోనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు 2017లో జపాన్‌ చట్టసభ  ఆయన్ను సింహాసనం నుంచి వైదొలిగేందుకు అనుమతినిస్తూ ప్రత్యేక బిల్లును ఆమోదించింది.
*అకిహితో 30 ఏళ్లపాటు జపాన్‌ చక్రవర్తి పదవిలో ఉన్నారు. ఒక చక్రవర్తి పదవి నుంచి తనంతట తాను తప్పుకోవడం జపాన్‌లో గత 200 ఏళ్లలో ఇదేతొలిసారి.
*టోక్యో రాజసౌధంలోని ‘రూమ్‌ ఆఫ్‌ పైన్‌’లో  సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కార్యక్రమంలో 85 ఏళ్ల అకిహితో తన సతీమణిసహా హాజరై లాంఛనంగా పదవి నుంచి వైదొలిగారు.
*పదవి నుంచి దిగిపోయే ముందు ఆయన తన చివరి రాజప్రసంగం చేశారు.
*ఆయన కుమారుడు నరుహితో (59)  జపాన్‌ 126వ చక్రవర్తిగా  ‘చామంతి సింహాసనాన్ని’ అధిష్టించనున్నారు.
*నరుహితో చక్రవర్తిగా ఉన్నంతవరకు కాలాన్ని రీవా శకంగా పేర్కొంటారు.

జపాన్:
*తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం.
*"సూర్యుడు ఉదయించే దేశం" (నిప్పన్) గా పిలుస్తారు.
*జపాన్ ఒక రాజ్యాంగబద్ధ రాజరికం. రాజు లేదా చక్రవర్తి కేవలం జాతికి, దేశానికి, జాతి సమైక్యతకు చిహ్నంగా మాత్రమే ఉంటాడు. 
*నిజమైన అధికారం ప్రధానమంత్రి చేతుల్లోను, ఎన్నుకొనబడిన ప్రతినిధుల (డయట్) చేతిలోను ఉంటుంది

views: 758

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams