Current Affairs Telugu Daily

కోహినూర్‌ వజ్రం విషయంలో దాఖలైన మరో పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
అత్యంత విలువైన, అపురూపమైన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి రప్పించే విషయంలో దాఖలైన మరో పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. భారత్‌కు చెందిన కోహినూర్‌ వజ్రం ప్రస్తుతం బ్రిటిష్ వారి అధీనంలో వుంది.
*అది భారత్‌ ఆస్తి అని దానిని తిరిగి రప్పించాలని కోరుతూ 2017లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. వేరే దేశం అధీనంలో ఉన్న వజ్రాన్ని రప్పించేందుకు తాము ఆదేశాలు జారీ చేయలేమని తీర్పునిస్తూ ఆ పిటిషన్‌ను 2017 నవంబర్‌లో సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ తాజాగా దాఖలైన మరో పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైంది.
*కోహినూర్ వజ్రం:(చారిత్రక నేపధ్యం)
*కోహినూర్ అంటే పర్షియన్ భాషలో కాంతి శిఖరం అని అర్థం. 
*గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో 1,300 సంవత్సరానికి పూర్వం ఇది లభించిందని  ప్రతీతి
*1,300 సంవత్సరంలో మాల్వా రాజు మహాలక్ దేవ్ వద్ద ఉండగా, మాల్వా రాజును జయించిన అల్లా ఉద్దీన్, ధనరాశులన్నింటితో పాటు కోహినూర్‌ను సైతం చేజిక్కించుకున్నారు.
*కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి వద్దనుండి  ఢిల్లీ సుల్తానులకు వారినుండి 
మొదటి పానిపట్టు యుద్ధం తరువాత బాబర్ చేతికి వెళ్లిందని 1,530న రాసిన బాబర్ నామాలో దీని ప్రస్తావన ఉంది
*1849లో జరిగిన సిక్కు యుధ్ధంలో ఓటమి పాలైన మహరాజా రంజిత్ సింగ్ దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీకి సమర్పించుకున్నారు.
*అనంతరం ఇది బ్రిటన్ రాణి విక్టోరియా వద్దకు వెళ్లింది. ఆ తర్వాత వజ్రానికి సాన బట్టించిన రాణి తన కిరీటంలో పొదిగించుకుంది. విక్టోరియా తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్ రాణులు దీనిని ధరించారు. బ్రిటన్ రాజ కుటుంబంలో పెద్ద కోడలికి ఈ వజ్రం కానుకగా ఇస్తుంటారు.
*ప్రస్తుతం ఇది బ్రిటన్ మ్యూజియంలో వేలాది అపురూప కళాఖండాలు, విలువైన వజ్రాల మధ్య ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తోంది. తాము వివిధ దేశాల నుంచి తెచ్చిన విలువైన వస్తువులను తిరిగి ఆ దేశాలకే ఇచ్చేస్తే, తమ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా ఉండదన్నది బ్రిటన్ ప్రభుత్వ వాదన.

views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams