Current Affairs Telugu Daily

యూఎస్‌తో కంట్రీ బై కంట్రీ (సీబీసీ) ఒప్పందాన్ని నోటిఫై చేసిన భారత్
పన్ను ఎగవేసే మల్టీ నేషనల్‌ కంపెనీలకు కళ్లెం వేసేందుకు అమెరికాతో కుదుర్చుకున్న కంట్రీ బై కంట్రీ (సీబీసీ) ఒప్పందాన్ని భారత్‌ నోటిఫై చేసింది. 
*ఈ ఒప్పందం కింద ఇరు దేశాల్లో వ్యాపారాలు చేసే ఎంఎన్‌సీల మాతృసంస్థలు ఫైలింగ్‌ చేసే వ్యాపార వివరాలను పరస్పరం మార్చుకుంటారు.
*అమెరికాలో 750 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించే మల్టీనేషనల్‌ సంస్థలు తప్పనిసరిగా సీబీసీని ఫైల్‌ చేయాలి. ఇక భారత్‌కు సంబంధించి రూ.5,500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందే సంస్థలు దీనిని ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.
*సీబీసీ నివేదికలో ఆయా కంపెనీలు దేశాల వారీగా సంపాదించిన ఆదాయం, చెల్లించిన పన్నుల వివరాలు ఉంటాయి. దీంతోపాటు ఆయా కంపెనీలకు అనుబంధ సంస్థల వివరాలు, వ్యాపార లక్షణాలను వెల్లడిస్తాయి.
*ఈ ఒప్పందం చేసుకొనే రెండు దేశాల్లో ఆయా కంపెనీలు పన్నులను ఎగ్గొట్టే అవకాశం తగ్గిపోతుంది. ఈ ఒప్పందం కింద జనవరి 2016 నుంచి సమాచారాన్ని పంచుకోనున్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు:
  • 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య
  • రాజదాని: వాషింగ్టన్ డి.సి
  • అధ్యక్షుడు: డోనాల్డ్ ట్రంప్
  • ఉపాధ్యక్షుడు:  మైక్ పెన్స్
  • వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది.
  • ఉత్తర దిశలో కెనడా దేశం, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో మరియు పడమట పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి
  • ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది
  • 16వ శతాబ్దం ప్రారంభంలోని ప్రముఖ ఇటాలియన్ సాహస యాత్రికుడు అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పదం ప్రాచుర్యంలోకొచ్చింది.

views: 739

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams