Current Affairs Telugu Daily

అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీగా పన్నులు విధిస్తోంది: ట్రంప్
విస్కాన్సిన్‌లోని కాగితం పరిశ్రమలు విదేశాలకు ఎగుమతులు చేస్తే చైనా, భారత్‌ భారీగా పన్నులు వేస్తున్నాయి. అందువల్ల అన్ని దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.
*భారత్ అమెరికా ఉత్పత్తులపై దారుణంగా పన్నుల భారం మోపుతోందని ఈ సందర్భంగా భారత్‌ను ‘‘పన్నుల రాజు’’ అని అభివర్ణించారు. 
*కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న భారీ పన్నులను తగ్గించాలని అమెరికాను భారత్‌ కోరుతోంది. మరోవైపు అమెరికా కూడా వ్యవసాయ, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఐటీ, కమ్యూనికేషన్స్‌ రంగంపై విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత్‌ను కోరుతోంది.
*మూడేళ్ల క్రితం హార్లీ-డేవిడ్‌సన్‌ మోటారు సైకిళ్ల కంపెనీ బైకులపై భారత్‌ 100 శాతం పన్ను విదిస్తుండటంతో ట్రంప్ చొరవతో ప్రధాని 50% పన్ను మినహాయింపులు కల్పించారు.

అదనపు సమాచారం:
*అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 29 వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది.
*జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)’ కింద భారత్‌కు కల్పించే ప్రయోజనాలను తగ్గించాలని అమెరికా నిర్ణయించడంతో ఈ విధమైన చర్యలు చేపట్టింది.
*భారత్ ప్రధానంగా ముడి సరుకులు, ఆర్గానిక్ కెమికల్స్ వంటి ఇంటర్మీడియేట్ గూడ్స్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తున్నది. 
*1976 నుంచి జీఎస్‌పీ కింద అమెరికా మార్కెట్‌లో రసాయనాలు, ఇంజినీరింగ్ వంటి పలు రంగాలకు చెందిన 1,937 భారతీయ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి.
*జీఎస్‌పీ పరిధిలో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులున్నాయి. పశుసంరక్షణ, మాంసం, చేపలు వంటి సముద్ర ఉత్పత్తులు, హస్తకళల వస్తువులకు జీఎస్‌పీ కింద పన్నులు పడటం లేదు.
* అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రధాన ఆదాయ వనరులైన ఎగుమతులకూ జీఎస్‌పీలో భాగంగా పన్ను మినహాయింపో లేక స్వల్ప పన్నులో వర్తిస్తున్నాయి.
*జీఎస్‌పీ కింద ప్రపంచంలోని దాదాపు 120 అభివృద్ధి చెందుతున్న దేశాలు లబ్ధి పొందుతున్నాయి. గతేడాది డిసెంబర్ నాటికి భారత్, బ్రెజిల్ దేశాలే ఎక్కువ ప్రయోజనం అందుకున్న దేశాలు. 
*ఈ విషయంలో టర్కీ ఐదో స్థానంలో ఉన్నది. చైనాతోపాటు మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు జీఎస్‌పీ అర్హత లేదు. 
*లబ్ధి పొందుతున్న దేశాలను, జీఎస్‌పీ పరిధిలో ఉన్న ఉత్పత్తులను ఏటా అమెరికా సవరిస్తూ ఉంటుంది.

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams