Current Affairs Telugu Daily

కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు
వాడేసిన టైర్లను ఎలా ధ్వంసం చేస్తున్నారో వివరాలు తెలపాలని కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) వివరాలు కోరింది.
*నిరుపయోగంగా మారిన టైర్లను ఉపయోగించి ఇంధనాన్ని తయారుచేస్తున్న చట్టవ్యతిరేకమైన కర్మాగారాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఎన్‌జీటీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 
*మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
*కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం పరిశ్రమలను నాలుగు భాగాలుగా విభజిస్తారు. 
*నీరు, గాలి కాలుష్యానికి దారితీసే ప్రమాదకర రసాయనాలను వెదజల్లే పరిశ్రమలకు తీవ్రతను బట్టి పాయింట్లు ఇస్తారు.
*కాలుష్యం స్థాయి 1-20 పాయింట్ల మధ్య ఉన్న పరిశ్రమలను వైట్‌ ఇండస్ట్రీస్‌ గా గుర్తిస్తారు. 
*ఇవి కాలుష్య కారకాలు కావు. కాలుష్యస్థాయి 21-40 మధ్య ఉంటే గ్రీన్‌, 41-59 మధ్య ఉంటే ఆరేంజ్‌, 
60 ఆపైన ఉంటే రెడ్‌ కేటగిరీ ఇండస్ట్రీ్‌సగా పేర్కొంటారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) :
ఏర్పాటు:2010
  • తొలుత ఛైర్‌పర్సన్‌: లోకేశ్వర్‌ సింగ్‌ పంతా
  • రెండవ చైర్ పర్సన్: జస్తిస్‌ స్వతంతర్‌ కుమార్‌ 
  • మూడవ ఛైర్‌పర్సన్‌: జస్టీస్ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌
(జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ రిటయిరయిన తరువాత జస్టిస్‌ ఉమేష్‌ దత్తాత్రేయ సాల్వి తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు)

views: 865

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams