Current Affairs Telugu Daily

సంప్రదాయ వైద్యంపై విశ్వసనీయత పెంచేందుకు సీసీఎంబీ, ఐపీసీల మధ్య ఒప్పందం
మూలికా మందుల వర్గీకరణ - ఔషధాల ప్రామాణీకరణతో సంప్రదాయ వైద్యంపై విశ్వసనీయత పెంచేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ(సీసీఎంబీ), ఘాజియాబాద్‌లోని ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌(ఐపీసీ) లు ఒప్పందం చేసుకున్నవి.
*డీఎన్‌ఏ విశ్లేషణ ఆధారంగా మూలికా మందులను వర్గీకరించి డాక్యుమెంటేషన్‌ చేయనున్నారు. 
*తద్వారా వేల సంవత్సరాల సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు రెండు సంస్థలు కలిసి కృషి చేస్తాయి.
*ఫలితంగా ఈ ఔషధాల వినియోగం పెరగడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams