హెలికాప్టర్ సేవలందించే పవన్ హాన్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఏప్రిల్ నెలకు ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే స్థితిలో కంపెనీ లేదని యాజమాన్యం ఉద్యోగులకు సర్క్యులర్ ద్వారా తెలియచేసింది.
*2018-19లో కంపెనీ ఆదాయం క్షీణించింది. రూ.89 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది’
*ముఖ్యంగా ఉద్యోగుల వేతనాలు భారంగా మారడంతో బకాయిల్లో 60 శాతం తిరిగి వచ్చేవరకు ఏప్రిల్ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు వివరించింది.
*పవన్‌హాన్స్ లిమిటెడ్‌లో పెట్టుబడులను తగ్గించుకునేందుకు సంబంధించిన disinvestment ప్రాసెస్‌ను గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సంస్ధలో ప్రభుత్వానికి 51 శాతం వాటాలుండగా ఓఎన్జీసీకి 49 శాతం వాటాలున్నాయి.
*కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఉషాపధీకి( తొలి మహీళా సీఎం డీ )‘ పవన్ హాన్స్’(హెలికాప్టర్ సేవల కల్పన సంస్థ) లిమిటెడ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యలను ప్రభుత్వం అప్పగించింది
views: 774