Current Affairs Telugu Daily

‘దివాలాస్మృతి ప్రస్తుత ధోరణులు, వాటి పరిణామాల’పై జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ-దిల్లీ) సమావేశం
రుణ బకాయిలు చెల్లించలేక జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి వచ్చే కంపెనీలను నిలబెట్టడానికే పరిష్కార నిపుణులు (ఆర్‌పీ)లు ప్రయత్నించాలని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ-దిల్లీ) ఛైర్మన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్‌ ఎస్‌.జె.ముఖోపాధ్యాయ పిలుపునిచ్చారు.
*ట్రైబ్యునళ్లు ఏ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేయవని,దక్షిణాదిలో ఎన్‌సీఎల్‌ఏటీ సర్క్యూట్‌ బెంచ్‌ పెట్టే ఉద్దేశం లేదని, ఇది ఆచరణ సాధ్యంకాని స్పష్టం చేశారు. 
*దిల్లీకి చెందిన లీగల్‌ డైలాగ్‌ ఫోరం, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘దివాలాస్మృతి ప్రస్తుత ధోరణులు, వాటి పరిణామాల’పై జరిగిన చర్చా కార్యక్రమంలో వీటిపై చర్చించారు.
*కంపెనీలపై రుణదాతలు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాక, సమస్యలు పరిష్కరించుకుని ఆ కంపెనీలు దివాలా, లిక్విడేషన్‌ ప్రక్రియల నుంచి బయటపడటానికి 7 మార్గాలున్నాయని ఈ సందర్భంగా వివరించారు.
*రుణదాతలు ట్రైబ్యునల్‌లో దరఖాస్తు దాఖలు చేయకముందు, దాన్ని విచారణకు స్వీకరించకముందు సమస్యను పరిష్కరించుకోవడం మొదటి దశ
*దరఖాస్తు చేశాక విచారణకు స్వీకరించకముందు రెండో దశ
*దరఖాస్తును విచారణకు స్వీకరించాక రుణదాతల కమిటీని ఏర్పాటు చేయకముందు మూడో దశ
*రుణదాతల కమిటీ ఏర్పాటయ్యాక కూడా రాజీ దశలో బకాయిలు చెల్లించి పరిష్కరించుకోవడం నాలుగోదశ
*మూడో వ్యక్తి సమర్పించిన పరిష్కార ప్రణాళికను అనుమతించడం అయిదో దశగా, లిక్విడేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆరో దశలో బయటికి రావచ్చన్నారు. ఇక చివరిగా 7వ దశలో కంపెనీని ఉద్యోగులతో సహా ఏకమొత్తంగా విక్రయించి, సమస్యను పరిష్కరించే దశ గా వివరించారు.
*వాస్తవానికి 180 రోజులు గరిష్ఠంగా 270 రోజుల్లో దివాలా ప్రక్రియ పూర్తి చేయాలన్న నిబంధన వుంది.

views: 778



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams