Current Affairs Telugu Daily

పన్ను ఎగవేతల నిరోధానికి కొత్త వ్యవస్థ ‘ఇ-ఇన్‌వాయిస్‌ జనరేషన్‌ సిస్టమ్‌’ 
ఒక స్థాయికి మించి జరిగే టర్నోవరు నిర్వహించే సంస్థలు, జీఎస్‌టీ నెట్‌వర్క్‌ పోర్టల్‌లోనే ఇ-ఇన్‌వాయిస్‌ రూపొందించేలా చూడాలన్నది  లక్ష్యంగా దీనిని ప్రతిపాదించారు.
*వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రవేశపెట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ కొంతమంది పన్ను ఎగవేతలకు ప్రయత్నిస్తుండటంతో మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
*ప్రతి ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌కు ఒక ప్రత్యేక సంఖ్య వస్తుంటుంది. ఇది రిటర్నులు, పన్నులు దాఖలు చేసే సమయంలో సమర్పించే ఇన్‌వాయిస్‌లతో సరిపోవాలి. దీంతో పన్ను ఎగవేతల్ని నిరోధించవచ్చు.
*ఇ-ఇన్‌వాయిస్‌ జనరేషన్‌ పద్ధతి ఇ-వే బిల్లు తరహాలోనే ఉండనుంది.
*ప్రతిపాదిత కొత్త విధానం రాబోయే కాలంలో ఇ-వే బిల్లుల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.
* ప్రస్తుతం రూ.50,000 మించిన వస్తువుల రవాణాకు కచ్చితంగా ఇ-వే బిల్లు సమర్పించాలి. 
*ఇ- టాక్స్  ఇన్‌వాయిస్‌ల విధానం ప్రారంభమైతే, వ్యాపారాల రిటర్నుల సమర్పణ కూడా సులభతరం అవుతుంది. విదేశాల్లో అధ్యయనం చేసి, ఇ-ఇన్‌వాయిస్‌ జనరేషన్‌ వ్యవస్థను అమల్లోకి తెచ్చే చర్యలు ప్రారభించింది.

జి.ఎస్.టి :
  • ఇది పరోక్ష పన్ను
  • GST ని ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ గా వ్యవరిస్తారు.
  • మూడు రకాల పన్నుల సమాహారం.
  • ఎస్.జి.ఎస్.టి/యుటి.జి.ఎస్.టి(SGST/UTGST), సి.జి.ఎస్.టి(CGST), ఐ.జి.ఎస్.టి(IGST).
  • ఏదైనా ఒక వస్తువు లేదా సేవను సరఫరా చేసినప్పుడు SGST/UTGST + CGST, లేదా IGST లలో ఒకదానిని విధిస్తారు
  • SGST/UTGST- రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల వస్తు మరియు సేవల పన్ను.
  • CGST- కేంద్ర వస్తు మరియు సేవల పన్ను. క్లుప్తంగా ఒక వస్తువు లేదా సేవ పై ఒక రాష్ట్రానికి రావలిసిన పన్ను మరియు కేంద్రానికి రావలిసిన పన్ను అని చెప్పవచ్చును. వీటిని సాధారణంగా ఏదైనా వస్తువు లేదా సేవల సరఫరా ఒకే రాష్ట్రం లోని ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగిన లేదా వ్యాపారికి వినియోగదారునికి మధ్య జరిగిన దీనిని విధించటం జరుగుతుంది. దీనినే అంతర్గత రాష్ట్ర సరఫరా అని కూడా అంటారు. SGST మీద వినియోగ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. CGST మీద వినియోగ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

views: 816

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams