Current Affairs Telugu Daily

చరిత్రలో మొట్టమొదటి సారి నిబంధనలను పక్కకు పెట్టి  నూతన నిర్ణయం తీసుకున్న యూఏఈ
యూఏఈ వివాహ నిబంధనల ప్రకారం ఇస్లాం మతానికి చెందిన పురుషుడు.. ఇతర మతాలకు చెందిన మహిళను పెళ్లాడవచ్చు. కానీ, ఇస్లాం మతానికి చెందిన మహిళ మాత్రం ఇతర మతాలకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకోకూడదు. 
*ఆ దేశం 2019వ ఏడాదిని ‘సహన సంవత్సరాది’గా ప్రకటించింది.
*దీంతో నిబంధనలను పక్కకు పెట్టి  యూఏఈ చరిత్రలో మొట్టమొదటి సారి హిందూ తండ్రి, ముస్లిం తల్లికి పుట్టిన పాపకు ఆ దేశ ప్రభుత్వం జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. 
*తొమ్మిది నెలల వయసులో ఆ పాప ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకుంది. 
*ఆ పాపకు అనాంత ఏస్‌లీన్‌ కిరణ్‌ అని పేరు పెట్టారు.

యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌( యూఏఈ):
  • యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్
  • యూఏఈ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌
  • రాజదాని: అబుదాబి

views: 826



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams