Current Affairs Telugu Daily

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగమైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ కేటగిరీలో నిధుల కొరత
ఉపాధి హామీ పథకంలో కూలీలు చేస్తున్న పనులకు చెల్లించే వేతనాలపై 2/3వ వంతు మొత్తాన్ని ‘మెటీరియల్‌ కాంపోనెంట్‌’ కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర గ్రామీణాభివృద్దిశాఖ ప్రత్యేకంగా కేటాయిస్తోంది.
*సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా అత్యధిక జిల్లాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. 
*తద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగమైన మెటీరియల్‌ కాంపోనెంట్‌ కేటగిరీలో నిధుల కొరత వేధిస్తోంది. 
*ఈ నిధులను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. గ్రామాల్లో రహదారులు, కాలువలు, పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలను ‘మెటీరియల్‌ కాంపోనెంట్‌’ నిధులతో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు.
*2018 ఏప్రిల్‌ నుంచి నవంబరు నెలాఖరు వరకు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కేటగిరీలో చేసిన పనులకు రాష్ట్రంలో రూ.3వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. 
*తరువాత కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు రూ.1,500 కోట్లకుపైగా పేరుకుపోయాయి. 
*దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పనులు అత్యధికంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం:

*2006-07 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం రెండువందల (200) జిల్లాల్లో మరియు 2007-08 ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై జిల్లాల్లో ప్రవేశపెట్టబడినది.
*2008 వ సంవత్సరంలో ఏప్రియల్ నెలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేశంలో సమస్త గ్రామీణ ప్రాంతాల్లో ముప్పైనాలుగు (34) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆరువందల పద్నాలుగు (614) జిల్లాలు, ఆరువేల తొంభైఆరు (6096) మండలాలు, రెండు లక్షల అరవైఐదు వేల గ్రామపంచాయితీలలోను విస్తరింపచేయబడింది.


ఎలాంటి పనులు ఈ పథకం కింద అనుమతింపబడతాయి:
  • నీటిని కాపాడటం, వాటర్ హార్వెస్టింగ్
  • కరువునివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
  • నీటికాలవలు(మైక్రో, చిన్ననీటిపారుదల పనులు)
  • షెడ్యూల్డ్ కులాలు, తెగలు లేదా ఆ భూమి లబ్దిదారులకున్న పొలాలకు నీటికాలవల సౌకర్యం ఏర్పాటు.
  •  ఇందులో భూసంస్కరణల వల్ల లబ్ది పొందిన వారి భూములకు, భారత ప్రభుత్వ పథకమైన ఇందిరా ఆవాస్ యోజన కింద భూమిని పొందినవారికీ వర్తిస్తుంది.
  • సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ(చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
  • భూమి అభివృద్ధి
  • వరదల నియంత్రణ, రక్షణ పనులు(నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
  • గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు. ఈరహదార్ల నిర్మాణంలో కల్వర్ట్లను నిర్మించడం కూడా జరుగుతుంది.
  • ఇవేగాక రాష్ట్రలను సంప్రదించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతించే పనులు.

views: 785

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams