Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు 
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన పాక్‌ జాతీయులు, వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉంటున్న పాకిస్థానీయులను స్వదేశానికి రప్పించేందుకు పాక్‌ నిరాకరించడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థానీయులకు వీసాల మంజూరును అమెరికా నిలిపివేస్తూ 
పాకిస్థాన్‌పై అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. 
పాక్‌తో దౌత్య సంబంధ విషయాల్లో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. కానీ, ఆంక్షలు విధిస్తున్నట్లు ఫెడరల్‌ రిజిస్ట్రార్‌ ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని వల్ల పాకిస్థానీయులకు వీసాల మంజూరు ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయవచ్చు
అమెరికా ఆంక్షలు విధించిన పది దేశాల జాబితాలోకి పాకిస్థాన్‌ కూడా చేరింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం ఆయా దేశాలు దేశబహిష్కృతులను, వీసా గడువు ముగిసిన వారిని వెనక్కి తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే గయానా(2001), గాంబియా(2016), కంబోడియా, ఎరిట్రియా, గునియా, సియెర్రా లియోన్‌(2017), బర్మా, లావోస్‌(2018) దేశాలపై ట్రంప్‌ ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతుండగా, ఈ ఏడాది ఘనా, పాకిస్థాన్‌ వచ్చి చేరాయి.

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams