Current Affairs Telugu Daily

రాష్ట్రానికి   పెను సవాలుగా మారనున్న రెవెన్యూ లోటు (AP)
2020-21 నుంచి ఐదేళ్లలో రూ.4.79 లక్షల కోట్లకు రెవెన్యూ లోటు చేరనుందని వారి అంచనా. 2023-24 సంవత్సరానికే రెవెన్యూ లోటు రూ.లక్ష కోట్లు దాటనుంది. ఆ మరుసటి ఏడాది ఇది దాదాపు రూ.1,22,878 కోట్లకు చేరనుంది. ‘ఇది రాష్ట్రానికి పెను సవాలే అని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యాంశాలు:
ఆదాయం పెరుగుదల 10.7%
వ్యయం పెరుగుదల 13% పైగా
స్థూల ఉత్పత్తి 2020-21లో రూ.11,18,650 కోట్లతో ప్రారంభమై 2024-25 నాటికి రూ.18,56,427 కోట్లకు పెరగనుంది
2020-21 నుంచి 2024-25 వరకు పన్నుల రూపంలో వచ్చే రాష్ట్ర సొంత ఆదాయం 10.7శాతం మేర పెరుగును.
రెవెన్యూ వ్యయం క్రమంగా 12.9 శాతం నుంచి 13 శాతానికి, వచ్చే ఐదేళ్లలో 13.3 శాతానికి పెరగనుందని అంచనా.
రెవెన్యూ లోటు గ్రాంటుగా ఇవ్వకపోతే..: అన్ని పరిస్థితులను బేరీజు వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రెవెన్యూ లోటు మొత్తం రూ.4,79,823 కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరుతోంది. ఈ వినతిని పట్టించుకోకపోతే రాష్ట్రం రుణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి వస్తే మూలధన వ్యయం తగ్గి రాష్ట్ర ప్రగతి మందగిస్తుంది. రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ లోటును గ్రాంటుగా మంజూరు చేయడం ఒక్కటే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.

views: 1102

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams