Current Affairs Telugu Daily

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పూజా రాణి కి స్వర్ణం 
ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ పూజా రాణి కి పసిడి పతకం. పూజ 81 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ వాంగ్‌ లీనా (చైనా)ను ఓడించి పసిడి పతకం గెలుచుకుంది.
*28 ఏళ్ల పూజకు ఈ టోర్నీలో పతకం సాధించడం ఇది రెండోసారి. 2012లో ఆమె రజతం గెలిచింది. 2014 ఆసియా క్రీడల్లో ఆమె కాంస్యం నెగ్గింది.
*పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌.. కకిమ్‌ (కొరియా)పై విజయం సాధించాడు. జాతీయ ఛాంపియన్‌ దీపక్‌సింగ్‌ (49 కేజీలు), కవీందర్‌ సింగ్‌ బిస్త్‌ (56 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (64 కేజీలు) ఫైనల్లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సరితాదేవి (60 కేజీలు), మనీషా (54 కేజీలు), సోనియా చాహల్‌ (57 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీష్‌ కుమార్‌ (91 కేజీల పైన) కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams