Current Affairs Telugu Daily

భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య 2023 నాటికి 40శాతం పెరుగనుంది
‘డిజిటల్‌ ఇండియా-టెక్నాలజీ టు ట్రాన్స్‌ఫార్మ్‌ ఎ కనెక్షన్‌ నేషన్‌’ పేరిట మెకెన్సీ గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదిక ప్రకారం 2018 చివరి నాటికి భారత్‌లో 560మిలియన్ల ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. 
*ఇంటర్నెట్‌ వినియోగదారులు, అంతర్జాతీయ సేవలు తదితర అంశాలపై
 ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న 17దేశాల్లో అధ్యయనం చేయగా, భారత్‌లో ఈ వృద్ధి గణనీయంగా ఉంది’ అని స్పష్టం చేసింది.
*భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య 2023 నాటికి 40శాతం పెరుగుతుందని, అదే విధంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు రెండింతలు అవుతారని మెకిన్సే తన నివేదికలో వెల్లడించింది. 
*భారత్‌లో మొబైల్‌ డేటా వినియోగం నెలకు సగటున 8.3జీబీగా ఉంది. చైనాలో ఇది 5.5జీబీగా ఉండగా డేటా వినియోగంలో దీనిలో భారత్ ముందంజలో ఉంది.
*డిజిటలీకరణలో ప్రభుత్వ పాత్ర కూడా విశేషంగా ఉందని , 2013 నుంచి అంతర్జాల సేవలు, డేటా టారిఫ్‌ల ధరలు తగ్గముఖం పట్టడం ద్వారా 2025 నాటికి డిజిటల్‌ రంగం వ్యాపారం రెండింతలు పెరిగి 355-435బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. 

డిజిటల్ ఇండియా:
*డిజిటల్ ఇండియా అనునది మనదేశంలో సమాచార సాంకేతిక రంగఫలాలను సామాన్య ప్రజానీకానికి చేరువ చేయడాకిని కేంద్రప్రభుత్వము ప్రారంభించిన పథకము. 2015 జూలై 1 న దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభించాడు.

లక్ష్యాలు:
  •  
  • 2.5 లక్షల పాఠశాలలకు వైఫై కనెక్షన్లు
  • బహిరంగ ప్రదేశాల్లో వైఫై హాట్‌స్పాట్‌లు
  • నాలుగు లక్షల ప్రజా అంతర్జాల లభ్యతా కేంద్రాలు
  • రు.లక్ష కోట్లతో డిజిటల్‌ ఇండియా పథకాలు
  • 2020 నాటికి ఎలక్ర్టానిక్‌ పరికరాల దిగుమతికి స్వస్తి
  • 1.7 కోట్ల ప్రత్యక్ష ఉద్యోగాలు
  • పరోక్షంగా 8.5 కోట్ల ఉద్యోగాలు
  • మల్టీ సర్వీస్‌ కేంద్రాలుగా 1.5 లక్షల పోస్టాఫీసులు
  • గ్రామీణ భారతంపై దృష్టి
  • 42,300 గ్రామాలకు టెలిఫోన్‌ సదుపాయం
  • 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌
  • కోటి మంది గ్రామీణ విద్యార్థులకు ఐటి శిక్షణ
  • టెలికాం సంస్థలలో 50వేల మంది గ్రామీణులకు ఉపాధి

views: 840



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams