Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఇంటర్‌ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. 
*ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు నోటీసులు పంపింది.
*3లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించిది. 
*విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జాతీయ మానవహక్కుల కమిషన్‌ :
*చట్టబద్ధమైన, స్వయం ప్రతిపత్తి సంస్థ
*'మానవ హక్కుల పరిరక్షణ చట్టం - 1993' ప్రకారం జాతీయ మానవహక్కుల కమిషన్‌ అక్టోబర్‌ 12, 1993న ఏర్పడింది. 
*1993 మానవ హక్కుల చట్టాన్ని 2006లో సవరించి, ఈ కమిషన్‌లో కొన్ని మార్పులు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
*నిర్మాణం : మానవహక్కుల కమిషన్‌లో ఒక ఛైర్మన్‌, నలుగురు ఇతర సభ్యులు ఉంటారు. వీరికి కింది అర్హతలు ఉండాలి.
- ఛైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
- ఒక సభ్యుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
- మరొక సభ్యుడు ఏదైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి.
- మిగిలిన ఇద్దరు సభ్యులు మానవహక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి.
పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులు ఉంటారు. 
*వారు జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌, జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌.
*ప్రస్తుతం జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా హెచ్‌.ఎల్‌.దత్తు వ్యవహరిస్తున్నారు.

views: 823Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams