Current Affairs Telugu Daily

ఉద్యోగుల భవిష్య నిధిపై 2018-19 ఏడాదికి 8.65% వడ్డీరేటు
ఉద్యోగుల భవిష్య నిధిపై 2018-19 ఏడాదికి 8.65% వడ్డీరేటు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 

*ఈ నిర్ణయంతో సంఘటిత రంగంలోని ఆరు కోట్లకు పైగా ఉద్యోగులకు మేలు కలగనుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వడ్డీరేటు స్వల్పంగా పెంచారు.

*భవిష్యనిధి చందాదారులకు 2018-19కి గాను ఈపీఎఫ్‌వో నిర్ణయించిన 8.65% వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్‌) ఆమోదం తెలిపింది’

*దీనికీ ఆమోదం తెలుపడం తో కార్మికశాఖ, ఆదాయపన్ను శాఖ త్వరలోనే ఈ విషయం నోటిఫై చేయనుంది. ఈపీఎఫ్‌వో అంచనా ప్రకారం 8.65% వడ్డీ ఇచ్చినా రూ.151.67 కోట్లు మిగులు ఉంటుంది. అదే 8.70% అయితే రూ.158 కోట్లు లోటు అవుతుందని సమాచారం.

**ఉద్యోగుల భవిష్య నిధి పథకం :Employees’ Provident Fund Scheme 
- ప్రారంభం:1952
- 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాస్తులుగా కలిగిన అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, సంస్థలు తప్పనిసరిగా ఈ పథకం కిందికి వస్తాయి. అటువంటి సంస్థలలో రూ. 15000 అంతకంటే తక్కువ ప్రాథమిక వేతనం (Basic Wages) కలవారు తప్పనిసరిగా సభ్యులుగా చేరవలసి ఉంటుంది. వేతనం రూ. 15000 కంటే ఎక్కువ ఉన్నవారు కూడా యాజమాన్య - ఉద్యోగ పరస్పర అంగీకారంతో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు అభ్యర్ధన పత్రం సమర్పించి సభ్యులుగా చేరవచ్చు.
- ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్న ౩ పథకాలలో ముఖ్యమైనది. 
- మిగతా రెండు పథకాలు ఉద్యోగుల పించను పథకం మరియు ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం .
- ప్రతి నెలా సభ్యుల ప్రాథమిక వేతనం మరియు కరువు భత్యం (Dearness Allowance) (అత్యధికంగా రూ. 15000 ) లలో 12% సంస్థకు జమ చేయాల్సివుంటుంది. యాజమాన్యం కూడా సమానమైన మొత్తం జమ చేస్తుంది. యాజమాన్య – కార్మిక పరస్పర అంగీకారంతో రూ. 15000 కంటే ఎక్కువ వేతనంపై కూడా 12% చెల్లించవచ్చు.

views: 802



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams