Current Affairs Telugu Daily

దేశీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని నిషేధించాలి: ద ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌అథారిటీ
దేశీయంగా క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని నిషేధించాలంటూ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగమైన ‘ద ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీ’(ఐఈపీఎఫ్‌) పిలుపునిచ్చింది.

*బిట్‌కాయిన్ల వంటి క్రిప్టోకరెన్సీల నిషేధంపై ముసాయిదా బిల్లు విషయంలో అంతర్‌ మంత్రిత్వ చర్చలను ప్రభుత్వం ప్రారంభించింద నుంది.

*క్రిప్టోకరెన్సీల నిషేధం, డిజిటల్‌ కరెన్సీల అధికారిక నియంత్రణ బిల్లు-2019’ పేరిట ఒక ముసాయిదా రూపొందించే యోచన లో ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

*క్రిప్టోకరెన్సీ నియంత్రణలపై ఒక ముసాయిదా తీసుకురావడానికి ఆర్థిక కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్‌ నేతృత్వంలో కమిటీని గతేడాది ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

*పలు ప్రభుత్వ విభాగాలు అన్ని రకాల క్రిప్టోకరెన్సీల విక్రయం, కొనుగోలు, జారీలపై పూర్తి నిషేధం విధించడానికి ఆమోదం కూడా తెలిపాయి.

*మే నెలలో క్రిప్టోకరెన్సీల నిషేధం ముసాయిదా బిల్లుపై తుది నిర్ణయం తీసుకొనున్నారు

బిట్ కాయిన్ :
- బిట్ కాయిన్ ను డిజిటల్ కరెన్సీగా చెప్పవచ్చు. 
- కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే నిర్మించబడి ఉంటుంది కావున ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక (1 బైట్ = 8 బిట్లు) దానిని బిట్ కాయిన్ అని పేరు పెట్టుకున్నారు.
- బిట్ కాయిన్ కి మూలాధారం ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ ను మొదట 2008లో తయారు చేశారు.
- 2009 లో మరో వ్యక్తి దానిని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మొదటి బిట్ కాయిన్ సృష్టించారు. బిట్ కాయిన్ ను పీర్ టు పీర్ కరెన్సీగా వాడుకలోకి తెచ్చారు. 
- అనగా మధ్యలో ఇంకెవరూ మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ట్రాన్సాక్షన్ (విలువ మార్పిడి) జరుగుతుంది.
- బిట్ కాయిన్ నిర్వహణలో వాడుకలో ఉన్న ఒక పదం బ్లాక్ చెయిన్. 
- ఒక గంటకు సరాసరి ఆరు సార్లు చొప్పున ఆమోదం పొందిన ట్రాన్సాక్షన్లను ఒక సముదాయంగా చేసి పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేసే ఒక్కో సముదాయాన్ని బ్లాక్ చెయిన్ అంటారు.
- ఒక బ్లాక్ చెయిన్ నమోదైన వెంటనే మొత్తం సర్వర్లలోకి ఇది పబ్లిష్ అయిపోతుంది. దీనివల్ల డూప్లిసిటీ నివారించబడుతుంది.

views: 685

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams