Current Affairs Telugu Daily

బహిరంగ ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించే  ప్రాజెక్టులకు రూ. 4 వేల కోట్లు
నిర్భయ నిధి కింద మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో ‘సురక్షిత నగర (సేఫ్‌ సిటీ)’ ప్రాజెక్టులకు గాను దాదాపు రూ. 3 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసింది. 

*బహిరంగ ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించేందుకు ఈ నిధులు వెచ్చిస్తారు.

*ఇందులో భాగంగా అత్యాచార, ఆమ్లదాడి బాధితులకు ఆర్థికసాయం అందించడంతో పాటు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక పోలీసు విభాగాలను ఏర్పాటు చేస్తారు.

*సేఫ్‌ సిటీ’ ప్రాజెక్టుల అమలుకు గాను హైదరాబాద్‌తో పాటు దిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, లఖ్‌నవూ నగరాలకు రూ. 2,919.55 విడుదల చేసింది.

*బాధితులకు నష్టపరిహార నిధి (సెంట్రల్‌ విక్టిమ్‌ కాంపన్సేషన్‌ ఫండ్‌) కోసం రూ. 200 కోట్లు కేటాయించారు.

*అత్యాచారాలు, ఆమ్లదాడులు, పిల్లలపై అఘాయిత్యాలు, మానవ అక్రమ రవాణా వంటి ఘటనల్లో బాధితులకు అండగా నిలిచేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. 

*దిల్లీలో మహిళలు, పిల్లల కోసం ఏర్పాటైన ప్రత్యేక యూనిట్‌, ఈశాన్య ప్రాంత ప్రత్యేక విభాగాల కోసం రూ. 23.53 కోట్లు కేటాయించారు. 

*పరిశోధనల్లో శిక్షణ, ప్రాసిక్యూషన్‌, వైద్య అధికారుల కోసం రూ. 7.09 కోట్లు, దిల్లీలో సబ్‌-డివిజనల్‌ పోలీసు ఠాణా స్థాయి; జిల్లా స్థాయిల్లో సామాజిక కార్యకర్తలు, కౌన్సిలర్ల కోసం రూ. 5.07 కోట్లు హోంశాఖ కేటాయించడంతోపాటు
12 రాష్ట్రాల్లో రూ. 131.09 కోట్లతో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో డీఎన్‌ఏ సౌకర్యాలను పెంపొందించనున్నారు.

*దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఫోన్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన ఏకీకృత ఈఆర్‌ఎస్‌ఎస్‌ నంబరు ‘112’కు గాను రూ. 321.69 కోట్లు మంజూరయ్యాయి. 

- నిర్భయ నిధి కింది వివిధ పథకాలను ప్రారంభించేందుకు సాధికారిక కమిటీ:

*నవంబర్ 2015న కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధి కింద వివిధ పథకాలను ప్రారంభించేందుకు సాధికారిక కమిటీని ఏర్పాటుచేసింది.

*ఈ సాధికారిక కమిటీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అందులో మహిళా శిశు సంక్షేమం, హోం శాఖ, రహదారి రవాణాశాఖ, రైల్వేశాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు.

*మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి ఈ సాధికారిక కమిటీకి చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.

*ఈ సాధికారిక కమిటీలో సభ్యులు, అధికారులు సంయుక్త కార్యదర్శికి తక్కువ ర్యాంకు కాకుండా ఉంటారు.

*ఈ సాధికారిక కమిటీ లోని అధికారులు నిర్భయ నిధి కింద వివిధ పథకాలు/ప్రాజెక్టుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 15 రోజుల్లోగా మహిళా శిశు సంక్షేమశాఖకు నివేదిస్తారు.

*ఏప్రిల్ 2015లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు బదులు మహిళా శిశు సంక్షేమశాఖ (డబ్ల్యుసిడి) ను నోడల్ ఏజెన్సీగా నియమించింది.

*నిర్భయ నిధి కింద 3 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధి కింద 2014-15, 2015-15  ఆర్ధిక సంవత్సరానికి వెయ్యి కోట్లను కార్పస్ ఫండ్ కింద విడుదలచేసింది

views: 733Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams