Current Affairs Telugu Daily

సీజేఐ కుట్ర పై విచారణకు ఏకసభ్య కమిటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయిని కుట్రపూరితంగా నేరారోపణ  జరిగిందన్న ఆరోపణలపై నిజానిజాలు తేల్చడానికి జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకసభ్య కమిటీని నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.పట్నాయక్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది.

*ఈ కమిటీ ఎప్పుడు కోరితే అప్పుడు పూర్తి సహకారం అందించాలని సీబీఐ డైరెక్టరు, ఐబీ చీఫ్‌, దిల్లీ పోలీసు కమిషనర్లను ఆదేశించింది

*సీజేఐపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ఈ కమిటీ విచారించదని స్పష్టం చేసింది.

*ఏకసభ్య కమిటీకి బదులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరపాలన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతా విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించింది.

views: 931



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams