Current Affairs Telugu Daily

39 దేశాలకు వీసా జారీని నిలిపేసిన శ్రీలంక  
దేశంలో ఇటివల జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో భద్రతా దృష్ట్యా 39 దేశాలకు వీసా జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

*శ్రీలంక ద్వీపం కావడంతో అక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా అక్కడికి లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు.

*ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 7,40,600 మంది పర్యాటకులు ఆ దేశాన్ని సందర్శించగా గతేడాది సుమారు 4,50,000మంది భారతీయులు శ్రీలంకను సందర్శించారు.

*ఈ వరుస పేలుళ్ల ఘటన కారణంగా భధ్రతా చర్యల నేపథ్యంలో శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది.

శ్రీలంక:
  • దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం.
  • పశ్చిమ ఆసియాకు మరియు ఆగ్నేయ ఆసియాకు నౌకాయాన కేంద్రంగా ఉంది.
  • పురాతన గ్రీకులు టాప్రొబేన్ అని, అరబ్బులు సేరేండిబ్ అని పిలిచేవారు. శ్రీలంకకు శిలయో అని 1505లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీసు వారు నామకరణం చేశారు. అదే ఆంగ్లంలో 'సిలోన్' గా అనువదింపబడింది. 1972లో శ్రీలంక ఆధికారిక నామం 'ఫ్రీ, సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' అయింది. 1978 లో, శ్రీలంకను ఆధికారికంగా 'డెమాక్రెటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక' గా ప్రకటించారు.

- అధ్యక్షుడు: మైట్రిపాల సిరిసేన
- ప్రధాని.   : రనిల్ విక్రమ సింఘె
- రాజదాని: కొలంబో (జయవర్దన పుర కొట్టే)

views: 784



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams