Current Affairs Telugu Daily

మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు హడ్కో అవార్డు
మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. మౌలిక వసతుల కల్పన - వినూత్న విధానాల విభాగంలో అవార్డు ఇవ్వాలని హడ్కో(కేంద్ర గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ) నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అవార్డును మిషన్‌ భగీరథ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ కృపాకర్‌రెడ్డి స్వీకరిస్తారు. ఈ విభాగంలో మిషన్‌ భగీరథకు ఇప్పటికే రెండుసార్లు అవార్డు వచ్చింది.
views: 1034



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams