Current Affairs Telugu Daily

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ కు మూడో స్వర్ణం  

మహిళల 1500మీ. పరుగులో పీయూ చిత్ర పసిడి సాధించింది. 4 నిమిషాల 14.56 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన ఆమె అగ్రస్థానంలో నిలిచింది.
*ఇదివరకు గోమతి మరిముత్తు (మహిళల 800మీ), తేజిందర్‌ పాల్‌ సింగ్‌ (పురుషుల షాట్‌పుట్‌) బంగారు పతకాలు గెల్చుకున్నారు.
ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో చిత్రకు వరుసగా ఇది రెండో స్వర్ణం. 2017లో జరిగిన ఛాంపియన్‌షిప్‌లోనూ ఆమె విజేతగా నిలిచిది.
*పురుషుల 1500మీ. పరుగులో అజయ్‌ కుమార్‌ సరోజ్‌ రజతం నెగ్గాడు. మూడు నిమిషాల 43.18 సెకన్లలో అతను రేసు ముగించాడు.
*మహిళల 200మీ. పరుగులో ద్యుతి చంద్‌ కాంస్యం సొంతం చేసుకుంది. 23.24 సెకన్ల టైమింగ్‌తో ఆమె మూడో స్థానంలో నిలిచింది.
*4×400మీ. రిలే పురుషుల, మహిళల విభాగాల్లో భారత్‌ రజతాలు కైవసం చేసుకుంది.

  • ఈ టోర్నీలో భారత్‌ మూడు స్వర్ణాలు సహా మొత్తం 17 పతకాలతో నాలుగో స్థానం సాధించింది.

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ః

  • వేదిక: ఖలీఫా అంతర్జాతీయ మైదానం -  ఖతర్ (దోహా) 
  • తేదీ:21-24 ఏప్రిల్ 
  • పాల్గొనే దేశాలు : 43

views: 771

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams