Current Affairs Telugu Daily

ప్రపంచంలోనే మొట్టమొదటిగా మలేరియా వ్యాక్సిన్‌(టీకా)వాడకాన్ని ప్రారంభించిన మలావీ ప్రభుత్వం 
ప్రపంచంలోనే మొట్టమొదటిగా మలేరియా వ్యాక్సిన్‌(టీకా)వాడకాన్ని ప్రారంభించిన మలావీ ప్రభుత్వం 

- డబ్ల్యుహెచ్‌వో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4,35,000 మంది పిల్లలు మలేరియా బారినపడుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది.

- ఈ నేపథ్యంలోనే మలావీ సర్కారు మలేరియా టీకా వాడకం ప్రారంబించింది.

- ఆఫ్రికాలోని మలావీ సర్కారు చేపట్టిన ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) స్వాగతించింది.

- మలేరియా నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు  30 ఏళ్లకు పైగా శ్రమించిన ఫలితమే ‘ఆర్‌టీఎస్‌,ఎస్‌’గా నామకరణం చేశారు..

- ఇక, ఘనా, కెన్యాల్లో త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ చిన్నారులకు అందుబాటులో ఉంటుందని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. 

- ఏటా ఆఫ్రికా దేశాల్లో 2,50,000 మందికి పైగా చిన్నారులు మలేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు.
 
  • ప్రతి రెండు నిమిషాలకు ఒక చిన్నారి మలేరియాతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) లెక్కలు చెబుతున్నాయి
- ఇలాంటి ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించేందుకు 30 ఏళ్ల పాటు పరిశోధనలు చేసిన ఆఫ్రికా దేశమైన మాలావికి చెందిన శాస్త్రవేత్తలు ఒక టీకాను కనుగొన్నారు. 

- డబ్ల్యూహెచ్‌వో సహకారంతో స్వచ్ఛంద సంస్థ పాథ్‌, గెలాక్సోస్మిత్‌క్లైన్‌ అనే ఫార్మాస్యూటికల్‌ కంపెనీ సంయుక్తంగా ఈ టీకాను అభివృద్ధి చేశాయి.

- ఆర్‌టీఎస్‌, ఎస్‌ అని పిలవబడే ఈ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం కూడా తెలిపింది. 

- క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా ప్రతి పది కేసుల్లో 4 కేసుల్లో ఈ టీకా మలేరియాను నివారించిందని పరిశోధకులు వెల్లడించారు
  • WHO: World Health Organization:
  • Headquarters: Geneva, Switzerland
  • Head: Tedros Adhanom
  • Founded: 7 April 1948

views: 949

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams