Current Affairs Telugu Daily

రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధమైన క్లోపిడోగ్రెల్‌ జనరిక్‌ ఔషధానికి చైనా అనుమతి
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైనాలో ఒక ఔషధాన్ని విక్రయించడానికి అనుమతి సంపాదిం చింది.

- రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధమైన క్లోపిడోగ్రెల్‌ జనరిక్‌ ఔషధానికి చైనా నియంత్రణ సంస్థ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుమతి లభించింది.

- అమెరికాలో సనోఫి- అవెంటిస్‌కు ఈ ఔషధ పేటెంట్‌ ఉండగా, అది 2012లో గడువు తీరిపోయింది. ఆ తర్వాత మైలాన్‌ భాగస్వామ్యంతో అమెరికా విపణిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ ఔషధాన్ని విడుదల చేసింది

- ప్రస్తుతం ఏటా 1.6 బిలియన్‌ డాలర్ల అమ్మకాలను ఈ ఔషధం నమోదు చేస్తోంది. చైనాలో గత కొన్నేళ్లుగా  డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ క్రియాశీలకంగా ఉంది. దాదాపు పది ఔషధాలను ఆ దేశంలో విక్రయిస్తోంది. వీటికి తోడు ఇప్పుడు మరొక ఔషధం జతకానుంది.
Dr. Reddy's Laboratories:
  • Headquarters: Hyderabad
  • CEO: G. V. Prasad 
  • Founder: Kallam Anji Reddy

views: 869



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams