Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమల విస్తరణ అనుమతులు సడలించిన ప్రభుత్వం
హైదరాబాద్‌ నగరానికి చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లో కొన్ని రకాల కాలుష్య కారక పరిశ్రమల విస్తరణ అనుమతులపై ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఆయా ప్రాంతాల్లోని అన్ని రకాల పరిశ్రమల విస్తరణకు ఈ మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

- మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ నాలుగు పాత జిల్లాల పరిధిలోని 51 పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో కాలుష్య కారక కొత్త పరిశ్రమల ఏర్పాటుపై, అప్పటికే ఉన్నవాటి విస్తరణపై రెండు దశాబ్దాల క్రితం నిషేధం విధించారు.

- కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని  రాష్ట్ర పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

- కాలుష్య రహిత పరిస్థితుల్ని పునరుద్ధరించేవరకు పరిశ్రమల విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దు..’’ అని ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఏదైనా పారిశ్రామిక యూనిట్‌ విస్తరణతో ప్రజాప్రయోజనం ఉంటుందని అనుకుంటే పరిశీలించవచ్చని అయితే, ఆ కంపెనీలో వ్యర్థాలను బయటకు వదలని జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ (జడ్‌ఎల్‌డీ) ఏర్పాట్లు ఉండాలని వివరించింది.

- పటాన్‌చెరు-బొల్లారం రిలీఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ఆయా కంపెనీల టర్నోవర్‌లో 1 శాతం మొత్తాన్ని అందులో డిపాజిట్‌ చేయాలి’’ అని ఎన్జీటీ షరతులు విధించింది. ఈ నేపథ్యంలో గతంలో విధించిన నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాలని కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు అనుమతించాలని బల్క్‌డ్రగ్‌ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 

- పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ నిషేధంపై గతంలో జారీ చేసిన 95, 64 జీఓలకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీఓ 24 జారీ చేసింది.

views: 795

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams