Current Affairs Telugu Daily

ఆర్‌బీఐ నిధులపై జూన్‌ నాటికి నివేదిక అందించనున్న బిమల్‌ జలాన్‌  కమిటీ
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద మూలధన నిల్వలు ఎంత మేర ఉండాలనే అంశాన్ని నిర్ణయించేందుకు  ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ జూన్‌ కల్లా తన నివేదిక సమర్పించనుంది.

- ప్రస్తుతం ఆర్‌బీఐ దగ్గర ఉన్న మిగులు నిధుల్లో కొంత మేరకు తమకు బదిలీ చేయాలన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ విజ్ఞప్తిని ఆర్‌బీఐ తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య విభేదాలు త్రీవమయ్యాయి. చివరికి నవంబరు 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో ఈ విషయం తేల్చేందుకు నిపుణుల నేతృత్వంలో ఈసీఎఫ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. 

- అందుకు అనుగుణంగానే బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ దగ్గర ఎంత మిగులు నిధులు ఉండాలి? ఆ నిధులను ఎలా ఉపయోగించాలనే విషయంపైనా ఈ కమిటీ సిఫారసులు చేస్తోంది. 

- ఈ మిగులు నిధులపై ప్రభుత్వంతో తలెత్తిన విభేదాలతోనే ఉర్జిత్‌ పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు.

- ఈ కమిటీ తొలిసారిగా సమావేశమైన రోజు మొదలు 90 రోజుల వ్యవధిలో తన నివేదికను సమర్పించాల్సి వుండగా మరో  3 నెలల పొడిగింపు లభించడంతో జూన్ నాటికి తమ నివేదిక అందించనున్నారు.

- ఆర్‌బీఐ వద్ద ఎంతమేర నిల్వలు ఉండాలనే విషయమై 3 కమిటీలు.. వి.సుబ్రమణ్యమ్‌ (1997), ఉషాథోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) అధ్యయనం చేశాయి.

views: 814

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams