Current Affairs Telugu Daily

పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారనున్న ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌(ఎన్‌హెచ్‌బీ), నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌)ల నుంచి మొత్తం వాటాలను ఆర్బీఐ ప్రభుత్వానికి విక్రయించనుంది.వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు; రూ.20 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించగా అవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మరనున్నవి.

- ఈ పెట్టుబడుల విక్రయంతో ఈ రెండు ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటా 100 శాతానికి చేరనుంది.

- అక్టోబరు 2001లో నరసింహం కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, ఆర్‌బీఐ సొంతం చర్చా పత్రమైన ‘హార్మనైజింగ్‌ ద రోల్‌ అండ్‌ ఆపరేషన్స్‌ ఆఫ్‌ డెవలపమ్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అండ్‌ బ్యాంక్స్‌’ సిఫారసుల అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది.

నరసింహం కమిటీ 
రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు : 
1. దీని ప్రకారం విత్త సంస్థలకు పుష్టి, లాభం, స్వేచ్చ ఉండాలి.
2. ఆర్‌బీఐ చట్టం ప్రకారం సీఆర్‌ఆర్‌ 15 శాతం నుండి కనిష్టస్థాయికి చేర్చాలి.
3. బ్యాంకు మొత్తం పరపతిని (పి.ఎస్‌.ఎల్‌)ను 40 శాతం నండి 10 శాతానికి తగ్గించాలి. 
4. బ్యాంకుల నిర్వహణలో రాజకీయ జోక్యం తగ్గించాలని, బ్యాంకులకు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించాలి.
5. బ్యాంక్‌లపై ద్వంద నియంత్రణ ఉండకూడదు. అంటే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వాల అధిపత్యం ఉండకూడదు. 
6. అంతర్జాతీయ పోటీకి అనుకూలంగా, మార్గదర్శకంగా ఆర్‌.బి.ఐను తయారు చేయడం.
7.లోన్‌మేళలను నిషేదించడం 
8. ప్రైవేట్‌ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల మధ్య తేడాలు ఉండకూడదని అదే విధంగా జాతీయం చేసే కార్యక్రమం మానుకోవాలని సూచించింది. 
9. బ్యాంకులను ప్రభుత్వ సెక్యూరిటీలపై చేసే పెట్టుబడులపై వడ్డీరేటు తక్కువగా ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం మార్కెట్‌ దృష్ట్యా వడ్డీ అమలు చేయాలని పేర్కొన్నారు.

views: 827



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams