Current Affairs Telugu Daily

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లైంగిక ఆరోపణల పై అంతర్గత విచారణ 
2018 అక్టోబరులో సీజేఐ తనను లైంగికంగా వేధించారని సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఇటీవల 22మంది జడ్జిలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో  ‘‘అంతర్గత విచారణ’’కు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదేశించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై తన అధ్యక్షతన ఏర్పాటైన ధర్మాసనం విచారించడమేమిటని సీజేఐ విచారణ తీరును రెండు సుప్రీంకోర్టు న్యాయవాద సంఘాలు తప్పుబట్టడం చర్చనీయాంశమైంది. 

ఈ నేపథ్యంలో ఈ కేసును జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలి నారిమన్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది.

సీజేఐ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో  అత్యంత సీనియర్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డేయే నేతృత్వంలో ఈ ధర్మాసనం ఏర్పాటు చేశారు.

దీనిలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ లు సభ్యులు గా వున్నారు.

సుప్రీం కోర్టు:
  • ఏర్పాటు : 1950 జనవరి 28
  • దేశంలో అత్యున్నత న్యాయస్థానం
  • భారత రాజ్యాంగంలోని 124 నుంచి 147 వరకు అధికరణలు భారత అత్యున్నత న్యాయస్థానం యొక్క కూర్పు, అధికార పరిధిని నిర్దేశించాయి.
  • ఇది హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానంలపై నియంత్రణాధికారం కల్గి ఉంది.
  • భారత దేశం రాజ్యాంగం ప్రకారం, ఒక సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.

views: 1036



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams