Current Affairs Telugu Daily

100 శాతం పోలింగ్ నమోదైన ఏకైక పోలింగ్ కేంద్రం
*దేశ వ్యాప్తంగా విడతల వారీగా జరుపుతున్న 17 వ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఈసీ ఎన్నో చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉండే ఒక్క ఓటరు భరత్‌దాస్‌ బాపు కోసం గిర్‌ అటవీ ప్రాంతంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. 

* దీంతో 100% పోలింగ్ నమోదైన ఏకైక కేంద్రంగా నిలిచింది.
  • భరత్‌దాస్‌ బాపు 
గిర్ అటవీ ప్రాంత పరిధిలోని దనేజా అనే గ్రామంలో నివసిస్తు ప్రాచీన ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు.అక్కడికి ఇతరుల ప్రవేశానికి అనుమతి లేని కారణంగా అతనికోసం ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది.
 
  • ఎన్నికల సంఘం:
*స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు  ఏర్పాటు చేసిన రాజ్యాంగ బద్ద సంస్థ.(నిబంధన-324)

*స్థాపన: 1950 జనవరి 25

*దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను నిర్వహిస్తుంది.

*ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్ళు, లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.
 
  • కార్యకలాపాలు:-
రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం.
- ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం
- ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
- స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను

views: 1090

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams