Current Affairs Telugu Daily

2018-19 ఆర్ధిక సంవత్సరానికి దేశంలో 11 శాతం ఔషధ ఎగుమతులు పెరుగుదల 
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) గణాంకాల ప్రకారం 2018-19లో ఔషధ ఎగుమతులు 11 శాతం పెరిగాయి.

- 2017-18లో మనదేశం ఎగుమతి చేసిన ఔషధాల విలువ 17.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.21 లక్షల కోట్ల) 

- 2018-19 లో 19.15 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.34 లక్షల కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతి

ఈ ఎగుమతుల్లో:

- ఉత్తర అమెరికా వాటా 30 శాతం (మొదటి స్థానం) తదుపరి స్థానాల్లో ఆఫ్రికా( ఎగుమతుల వాటా 19 శాతం), ఐరోపా(16 శాతంగా) సమాఖ్య ఉన్నాయి.

- మొత్తం ఎగుమతుల్లో జనరిక్‌ ఔషధాల వాటా 75%

- చైనా,దక్షిణాఫ్రికా, రష్యా, నైజీరియా, బ్రెజిల్‌, జర్మనీ దేశాలకు కూడా ఎగుమతుల్లో వృద్ధి ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే ఔషధాల్లో దాదాపు 30 శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి. దాని ప్రకారం చూస్తే దేశీయ ఔషధ రంగంలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఎంతో కీలక  పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో కొన్ని విదేశీ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి, ఔషధ తయారీ చేపడుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిశ్రమ విస్తరిస్తోంది.

- ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్‌ తయారీలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్స్‌ తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని.. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్‌ డ్రగ్స్‌లో మూడింట ఒక వంతు బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌ నుంచే అవుతున్నాయి.

views: 812



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams