Current Affairs Telugu Daily

దేశీయ ఔషధ పరిశ్రమకు అత్యంత ఆకర్షణీయం కానున్న బయో సిమిలర్‌ ఔషధాల తయారీ 
దేశీయ ఔషధ పరిశ్రమకు బయో సిమిలర్‌ ఔషధాల తయారీ అత్యంత ఆకర్షణీయ అవకాశంగా మారుతోందని దిల్లీలో జరుగుతున్న  ‘సీపీహెచ్‌ఐ ఇండియా 2019’ సదస్సు ' ద్వారా స్పష్టమైంది.

- బయో సిమిలర్‌ ఔషధాల తయారీలో అమెరికా, జర్మనీ, ఐర్లాండ్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాల స్థాయికి మనదేశం కూడా చేరుకునే అవకాశం ఉందనేది తాజా అధ్యయనాల సారాంశం.

- 2000 సంవత్సరంలో మనదేశంలో తొలి బయో సిమిలర్‌ ఔషధంగా హెపటైటిస్‌- బి కి అనుమతి వచ్చింది. కేన్సర్‌, గుండెపోటు విభాగాల్లో బయో సిమిలర్ ఔషధాలతో పాటు మనదేశంలో ఇప్పటికే 70 కి పైగా బయో సిమిలర్‌ ఔషధాలకు అనుమతి ఉంది. 

- బయో సిమిలర్స్‌కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) ఎటువంటి విధివిధానాలను అనుసరిస్తుందో, ఇక్కడా వాటినే అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ) ప్రయత్నిస్తోంది. 

- ఒక బయో సిమిలర్‌ ఔషధాన్ని అమెరికాలో ప్రయోగాలు- పరీక్షల దశ అధిగమించి, అనుమతి స్ధాయికి తీసుకెళ్లాలంటే 150 మిలియన్‌ డాలర్ల వరకు (రూ.1,000 కోట్లకు పైగా) ఖర్చవుతుంది. ఆ తర్వాత తయారీ వ్యయాలు కూడా అధికంగా ఉంటాయి. అదే మనదేశంలో అయితే తయారీ వ్యయాలు ఎంతో తక్కువ. అందువల్ల భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా మనదేశంలో బయో సిమిలర్స్‌ తయారు చేయడానికి విదేశీ ఫార్మా కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయనే  అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు


బయో సిమిలర్‌ ఔషధం అంటే..

* బ్రాండెడ్‌ ఔషధాలకు జనరిక్‌ ఔషధాలు ఉన్నట్లే బ్రాండెడ్‌ బయో ఔషధాలకు సరిసమాన ఔషధాలనే బయో సిమిలర్‌ ఔషధాలుగా వ్యవహరిస్తున్నారు.
* సాధారణ ఔషధాలను రసాయన ముడిపదార్ధాల నుంచి తయారు చేస్తారు. బయో సిమిలర్స్‌ మాత్రం జంతు లేదా వృక్షాల నుంచి సేకరించే ప్రొటీన్ల నుంచి తయారవుతాయి.
* కొన్ని రకాల కేన్సర్ల చికిత్సలో, రూమాటాయిడ్‌ ఆర్డరైటిస్‌ను అదుపు చేయడానికి... ఇంకా ఎంఎస్‌డీ (మల్టిపుల్‌ స్కెలరోసిస్‌ డిసీజ్‌) వంటి ఎన్నో రకాల వ్యాధులను అదుపు చేయడంలో బయో సిమిలర్‌ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

views: 788



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams