Current Affairs Telugu Daily

తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను మొదలు పెట్టిన సూర్యోదయ్‌ బ్యాంక్‌
2016-17 ఆర్ధిక సంవత్సరంలో సూక్ష్మ రుణ సంస్థ నుంచి  బ్యాంకుగా మారిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలకు ప్రారంభించనుంది.

- ద్వితీయ శ్రేణి పట్టణాలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో దశల వారీగా 25 శాఖలు ఏర్పాటు చేయనున్నారు.

- ప్రస్తుతం బ్యాంకుకు 50వేల మంది ఖాతాదారులు ఉండగా, 2020 కల్లా దేశ వ్యాప్తంగా 400 శాఖలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది.

సూక్ష్మ రుణ సంస్థల ప్రాముఖ్యతః

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను చైత‌న్యం చేయ‌డంలో బ్యాంకులతో పాటు బ్యాంకింగేతర సంస్థలు త‌మ తోడ్పాటునందిస్తున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు అంద‌నివారికి స‌హ‌క‌రించ‌డం, గ్రామీణ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించ‌డం, బ్యాంకింగ్‌ వ్యవస్థ లేని ప్రాంతాల్లో త‌మ సేవ‌ల్ని ముమ్మ‌రం చేస్తున్నాయి బ్యాంకింగేతర సంస్థలు. అసంఘటిత రంగంలోని వారికి రుణాలు అందించ‌డంలో బ్యాంకింగేత‌ర సంస్థ‌ల కోవ‌కు చెందిన‌ సూక్ష్మ రుణ సంస్థలు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి
  • సూర్యోదయ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ బాబు

views: 898



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams