Current Affairs Telugu Daily

నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పరిష్కారానికి  బ్యాంకులకు మరింత సమయం ఇవ్వనున్న ఆర్బీఐ
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఐ) సూచన మేరకు నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిష్కారంలో బ్యాంకులకు 180 రోజులు కాకుండా అదనంగా మరో 60 రోజులు సమయమిచ్చే  విధానం ను ప్రకటించనుంది.

- 2019ఫిబ్రవరి 12 నాటి ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసినందున, నూతన నిబంధనల్లో  ఈ తరహా అంశాలను చేర్చనుంది.

- గడువుకు ఒక్క రోజు దాటినా, ఎగవేతగా భావించాలనే నిబంధనలో మార్పులు,మొండి బకాయిగా గుర్తించేందుకు, రుణ పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు తొలి ఎగవేత నుంచి 30 రోజులు సమయాన్ని బ్యాంకులకు ఇచ్చే అవకాశం ఉంది.

- తదుపరి పరిష్కార ప్రణాళికకు బ్యాంకులకు 180 రోజులు కాకుండా అదనంగా మరో 60 రోజులు ఇచ్చే యోచన చేస్తున్నట్లు తెలిపింది.

- అంటే మొత్తంమీద ఎన్‌పీఏల పరిష్కారానికి ఎగవేత తొలి రోజు నుంచి గడువు  270 రోజులకు పెరగనుంది

- అప్పటికీ ఎన్‌పీఏ సమస్య పరిష్కారం కాకుంటే జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది.

*ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (రూ.కోట్లలో)
* 2015 - 2,04,959
* 2013  - ,06,183
* 2016 - 4,17,988
* 2014 - 1,47,448
* 2018 - 5,06,922

views: 816



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams