Current Affairs Telugu Daily

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గోమతి, తజిందర్‌ కు స్వర్ణం 

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు స్ప్రింటర్‌ గోమతి మరిముత్తుతో పాటు షాట్‌పుటర్‌ తజిందర్‌ సింగ్‌ తూర్‌ స్వర్ణాలు గెలుచుకున్నారు.

-మహిళల 800మీ. పరుగులో అగ్రస్థానంలో నిలిచిన గోమతి భారత్‌కు తొలి పసిడిని అందించింది. రెండు నిమిషాల 2.70 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె అగ్రస్థానంలో నిలిచింది.

-షాట్‌పుట్‌లో తజిందర్‌ గుండును 20.22 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.

-జావెలిన్‌ త్రోలో శివ్‌పాల్‌ సింగ్‌ ఈటెను 86.23 మీటర్ల దూరం విసిరి రజతం గెలిచాడు.

-400మీ. హార్డిల్స్‌ పురుషుల విభాగంలో జబీర్‌, మహిళల్లో సరిత కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 

ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ః

  • వేదిక: ఖలీఫా అంతర్జాతీయ మైదానం -  ఖతర్ (దోహా) 
  • తేదీ:21-24 ఏప్రిల్ 
  • పాల్గొనే దేశాలు : 43

  •  

views: 901



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams