Current Affairs Telugu Daily

ఆర్‌బీఐ  మిగులు నిధుల్లో రూ.3 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చు: బిమల్‌ జలాన్‌ కమిటీ 
గతంలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులు ఎంతమేర ఉండొచ్చు అనే అంశాన్ని తేల్చడానికి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ జలాన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది.

-అత్యవసర నిల్వలు, పునర్విభజన నిల్వల నుంచి కొంతమొత్తం ప్రభుత్వానికి బదిలీ అంశం తమ నివేదికలో పేర్కొన నుంది.

-ప్రభుత్వ ఖజానా బలోపేతానికి, ఆర్‌బీఐ మిగులు నిల్వల్లో అదనపు నిధులను బదిలీ చేయాలని ప్రభుత్వం గతేడాదిగా కోరుతూ వచ్చింది. 

-గత ఆర్‌బీఐ  గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, ముఖ్య సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ దీనిని సమర్థించారు. 

-దీనిలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ.3 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని బిమల్‌ జలాన్‌ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ నివేదిక అంచనా వేస్తోంది

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ నివేదిక అంచనాలు:

-గత సెప్టెంబరు ఆఖరుకు ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు రూ.9.6 లక్షలకోట్లున్నాయి. ఇందులో అదనపు నిల్వలు రూ.1-3 లక్షల కోట్లు
జలాన్‌ కమిటీ సభ్యులుః
  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ జలాన్‌
  • ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ రాకేశ్‌ మోహన్‌
  • ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్‌చంద్ర గార్గ్‌
  • ఎన్‌ఎస్‌ విశ్వనాధన్‌
  • ఆర్‌బీఐ బోర్డు సభ్యులు భరత్‌ దోషి, సుధీర్‌ మన్‌కడ్‌ 

views: 899



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams