Current Affairs Telugu Daily

పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయపరిమితిని సవరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
నూతన పంచాయతీరాజ్ చట్టం- 2018 ఆధారంగా చేసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల వ్యయపరిమితిని 2011 జనాభా ఆధారంగా, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని పెంచారు. ఈ లెక్కన జెడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థి రూ.4 లక్షల వరకు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.50 లక్షల వరకు ప్రచారానికి ఖర్చుచేసుకోనేవిదంగా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది.

--దీనితో పాటుగా ఎన్నికల్లో ప్రతి పైసా ఖర్చును సైతం బ్యాంకు ఖాతా నుంచి చెల్లించాలని నిబంధన విధించడం తోపాటు అభ్యర్థులు రోజువారీగా ఖర్చుల వివరాలను ఎంపీడీవోలకు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. 

--ఇందుకు ప్రత్యేక ఫార్మాట్‌ను సైతం అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

-ఎన్నికలు ముగిసిన 45 రోజులవరకు పూర్తి ఎన్నికల ఖర్చును అభ్యర్థులు  సమర్పించాలి. లేనిచో ఎన్నికల్లో పాల్గొనకుండా అనార్హతకు గురవుతారు.
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌
  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్: నాగిరెడ్డి

views: 959



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams