Current Affairs Telugu Daily

మాస్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌తో ఐఎస్‌బీ ఒప్పందం
 బోధనా సిబ్బంది, పరిశోధకుల మార్పిడి, ఉమ్మడిగా సదస్సుల నిర్వహణ, పరిశోధనా ప్రాజెక్టుల నిర్వహణ వంటి కార్యక్రమాల నిర్వహణ కొరకు హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఎస్‌బీ), మాస్కో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- ‘స్కోల్‌కోవో’ తో సహకార ఒప్పందం కుదుర్చుకుంది.

-దీని ప్రకారం రెండు విద్యా సంస్థలు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌, మేనేజ్‌మెంట్‌ పరిశోధనా విభాగంలో సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టనున్నవి.

--రష్యాలోన అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ విద్యా సంస్థ అయిన స్కోల్‌కోవో తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవటం ద్వారా సరికొత్త అవకాశాన్ని ఐఎస్‌బీ అందిపుచ్చుకున్నది.

--ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌, పబ్లిక్‌ పాలసీ, కుటుంబ వ్యాపారాలు  వంటి వివిధ విభాగాల్లో తాము కలిసి ముందుకు సాగుతామని స్కోల్‌కోవో డీన్‌ ప్రొఫెసర్‌ మారత్‌ అత్నషెవ్‌ వివరించారు.

views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams