Current Affairs Telugu Daily

దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ: శ్రీలంక
వరుస పేలుళ్లు, పదుల సంఖ్యలో పేలని బాంబు లు బయటపడుతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు.

-ఆయన అధ్యక్షతన   జాతీయ భద్రతా కౌన్సిల్ సమావేశం జరిపి  ఏప్రిల్ 22అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

-ఎమర్జెన్సీ విధింపుతో పోలీసులు, భద్రతా దళాలకు యుద్ధసమయంలో మాదిరిగా అత్యున్నత అధికారాలు దక్కనున్నాయి

-భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉగ్రవాదులను నియంత్రించేందుకు మాత్రమే ఎమర్జెన్సీ విధిస్తున్నామని వివరించారు.

-వరుస పేలుళ్లపై విచారణ జరిపేందుకు అధ్యక్షుడు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి విజిత్ మలాల్గోడ నేతృత్వం వహిస్తారు. మాజీ ఐజీపీ ఎన్‌కే ల్లాంగకూన్, హోంమంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పద్మసిరి జయవర్ధనే సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి రెండు వారాల్లోగా తుది నివేదిక ఇవ్వనున్నది.
  • శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపలా సిరిసేనా
  • ప్రధానమంత్రి - రానీల్ విక్రమ సింగే 

views: 783



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams