Current Affairs Telugu Daily

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.10,000 కోట్ల రుణం అందించనున్న పవర్‌ ఫైనాన్స్‌ సంస్థ
ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ప్రభుత్వం 2015 జూన్‌లో అనుమతులు మంజూరు చేసింది. 

-ఈ ఎత్తిపోతల పథకం పనులను కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ (కేఎల్‌ఐపీసీ)తో అనుసంధానం చేయడం వలన బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి వెసులుబాటు లభించింది. 

-దీనికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) రూ.పదివేల కోట్ల వరకు రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపింది.

​​​​​​​-ఈ తరహా రుణం పొందడానికి ఎత్తిపోతల పథకానికి కార్పొరేషన్‌ తరహాలో ప్రత్యేక వ్యవస్థ అవసరం అవడంతో  ఇప్పటికిప్పుడు దాన్ని ఏర్పాటుచేయడం కన్నా అందుబాటులో ఉన్న కేఎల్‌ఐపీసీతో అనుసంధానించి వేగంగా రుణం పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమీకరణపరంగా రాష్ట్రం మరో ముందడుగు వేసింది.

​​​​​​​-శ్రీశైలం జలాశయం  నుంచి నీటిని తీసుకునేలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో ఈ పథకానికి నాంది పలికారు. రోజుకు ఒకటిన్నర టీఎంసీ వంతున అరవై రోజులపాటు ఎత్తిపోతలకు నిర్మాణాలు ప్రారంభించారు.

చారిత్రక నేపధ్యం:

​​​​​​​-పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర

​​​​​​​-1956 లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడడం వలన అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. హైదరాబాద్‌ రాష్ట్రంగా కొనసాగి ఉంటేె అప్పర్‌ కృష్ణా, భీమా, తుంగభద్రా ఎడమ కాలువ ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది.

​​​​​​​-మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటె అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే.

​​​​​​​-తెలంగాణా రిటైర్డ్‌ ఇంజనీర్లు 2005 లో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి సీమాంధ్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది.

​​​​​​​-ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం క్రిష్ణా జలాలను జూరాల నుండి ఒక లక్ష క్యూసెక్కుల నీరు క్రిందికి ప్రవహిస్తున్న దశలో 25 రోజులలో 70టి.ఎం.సిల నీటిని ఎత్తిపోసి 3 జలాశయాల్లో నింపి వాటి ద్వారా దాదాపు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరు, పరిశ్రమల అవసరాలకు నీరు, జంటనగరాలకు మరియు దారి పొడవునా గ్రామాలకు మంచి నీరు అందించడం.

views: 763

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams