ఇరాన్ నుంచి భారత్ కు ముడి చమురు దిగుమతిపై ఇస్తున్న రాయితీని కొనసాగించలేమని వెల్లడించిన అమెరికా
అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కార్యక్రమాన్ని ఇరాన్ విరమించుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.
-ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు ఇప్పటివరకూ ఇచ్చిన రాయితీలను ఇక కొనసాగించలే మని స్పష్టం చేసింది.
-చైనా సహా ఏడు దేశాలకు ఇస్తున్న రాయితీని మే నెల నుంచి పొడిగించలేమని ప్రకటిస్తూ ఈ మేరకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో పూర్తి వివరాలను వెల్లడించ నుంది.
-ముడి చమురును అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. మన దేశంతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీ, తైవాన్, ఇటలీ, గ్రీస్ తదితర దేశాలు ఇరాన్ నుంచి అధికంగా చమురు కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇరాన్ చమురు ఎగుమతులను సున్నా చేసి, దాన్ని ఆర్థికంగా ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని వివిధ వర్గాలు వెల్లడించాయి.
ముఖ్యాంశాలు:
-గతేడాది మే నెలలో ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నాటినుండి ఆ దేశంపై అగ్ర రాజ్యం ఆంక్షలు మొదలయ్యాయి.
-ఏ దేశమూ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. దీంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి.
-ఇరాన్ ముడి చమురును చైనా తర్వాత మనమే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో రాజకీయంగా ఒత్తిడి రావడంతో చమురు కొనుగోళ్లకు సంబంధించి భారత్‌కు మాత్రం ఆరు నెలల పాటు రాయితీ ఇస్తూ అమెరికా వెసులుబాటు కల్పించింది. మే మొదటి వారంతో ఈ గడువు పూర్తి కానుంది.
-ఈ నేపథ్యంలో రాయితీలను కొనసాగించలేమని అమెరికా స్పష్టం చేసింది.
-భారత్ తన ముడిచమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటుంది.
-సగటు భారతీయ కుటుంబం తమ కుటుంబ ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఇంధనానికే ఖర్చు చేస్తుందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది.
views: 724